మా దృక్పథం
ఏ మనిషి కష్టంలో ఉన్నప్పుడు “నాకు ఎవరూ లేరు” అనే భావన రాకుండా, ప్రతి అవసరంలో ఒక మానవతా చేయి అందే సమాజాన్ని నిర్మించాలనేది మా కల.
సేవా భావనను ఒక వ్యక్తి నుంచి కుటుంబానికి, కుటుంబం నుంచి గ్రామానికి, గ్రామం నుంచి సమాజానికి విస్తరించడం మా దీర్ఘకాలిక లక్ష్యం.
అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవంతో, బాధ్యతతో, సాధ్యమైనంత వరకు ప్రత్యక్ష సహాయం అందించే సేవా వ్యవస్థను నిర్మించడమే మా విజన్.
మమతల పందిరి సేవా కార్యక్రమాలకు ఇప్పటికే రెండు జాతీయ స్థాయి అవార్డులు లభించడం మా సేవా ప్రయాణానికి లభించిన గౌరవంగా భావిస్తున్నాము. ఈ గుర్తింపు మరింత బాధ్యతతో సేవ చేయాలనే ప్రేరణను ఇస్తోంది.