మా లక్ష్యం
మమతల పందిరి సేవా సమితి ప్రధాన లక్ష్యాలు:
- అవసరంలో ఉన్న ప్రజలకు ప్రత్యక్షంగా సహాయం చేయడం.
- అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వారికి రక్తదాతలను సమన్వయం చేసి రక్తం అందేలా చేయడం.
- రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు మరియు మెడికల్ క్యాంపులు నిర్వహించడం.
- రక్తం, వైద్యం, ఆహారం, విద్య మరియు అత్యవసర సహాయాన్ని అందించడం.
- పేద కుటుంబాలు, విద్యార్థులు, రోగులు, వృద్ధులు మరియు ఇతర అవసరమైన వర్గాలకు అండగా నిలవడం.
- గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో అవసరాలను గుర్తించి సేవలను ప్రజల వద్దకే తీసుకెళ్లడం.
- గర్భిణీ మహిళలకు అత్యవసర ఆసుపత్రి రవాణా సహాయం అందించడం.
- మహిళలకు నైపుణ్య శిక్షణ మరియు స్వావలంబనకు అవసరమైన సహకారం అందించడం.
- అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు మరియు గ్రామీణ సమాజంలో అవసరమైన సహాయ కార్యక్రమాలు నిర్వహించడం.
- ప్రకృతి వైపరీత్యాలు మరియు విపత్కర పరిస్థితుల్లో బాధితులకు ప్రత్యక్షంగా సహాయం చేయడం.
- వాలంటీర్లు, పోషకులు మరియు సేవాభిమానుల భాగస్వామ్యంతో సేవా కార్యక్రమాలను విస్తరించడం.
- భవిష్యత్తులో ఆనంద నిలయం వంటి శాశ్వత సేవా వేదికలను నిర్మించడం.
- సేవను ఒక కార్యక్రమంగా కాకుండా నిరంతర మానవతా బాధ్యతగా కొనసాగించడం.